ఏపీ: ఒక్క దెబ్బతో ఏ పార్టీలో చేరడం పై క్లారిటీ ఇచ్చిన విడుదల రజిని..?

Divya
2024 ఎన్నికలలో వైసిపి పార్టీ గోర ఓటమి తర్వాత చాలామంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులు సైతం పార్టీని వీడి ఇతర పార్టీలలోకి చేరారు. అలా ఇప్పటికి కొంతమంది నేతలు కూడా చేరుతూ ఉన్నారు. తాజాగా పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రిగా పేరు సంపాదించిన విడుదల రజిని కూడా వైసిపి పార్టీ వీడి త్వరలోనే మరో పార్టీలోకి చేరబోతోందని పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది. అయితే ఈ విషయం పైన ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చిన మళ్లీ వైరల్ గా మారడంతో మరొకసారి క్లారిటీ ఇచ్చింది విడుదల రజిని.



మాజీ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ.. బీసీ మహిళ పైన ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడమే అధికార పార్టీ లక్ష్యం అంటూ ఫైర్ అయ్యింది. తాను చిలకలూరిపేట నుంచి రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తానంటూ మరొకసారి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. ఇక మెడికల్ కళాశాల ప్రైవేటు కరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము కోటి సంతకాలు సేకరణ చేపట్టామని ఇప్పటికే తన నియోజకవర్గమైన చిలకలూరిపేటలో 64,511 సంతకాలు సేకరించామంటూ తెలిపింది.


ఈ సంతకాల సేకరణను పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అప్పగించడం జరుగుతుందంటూ తెలియజేసింది మాజీ మంత్రి రజిని. చిలకలూరిపేట జాతీయ రహదారి పైన ఇటీవల ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇందులో 5 మంది విద్యార్థులు మరణించారు ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఒక పోలీస్ కుమారుడే, అలాంటి వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉన్నారని పోలీస్ కుమారుడు కాబట్టే పోలీస్ వ్యవస్థ కేసు విచారణలో నిర్లక్ష్యం చేస్తోంది అంటూ ఫైర్ అయ్యింది మాజీ మంత్రి. కూటమి వైసిపి నేతలను టార్గెట్ చేసి వారి పైన అక్రమా కేసులు  పెడుతున్నారంటూ ఫైర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: