జూబ్లీహిల్స్ బై పోల్:మహాలక్ష్మి పథకం రూ. 2500 ఎప్పుడంటే..?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు రూ.4వేల రూపాయలు పింఛని అందిస్తుందని, మహిళలకు ప్రతినెల రూ. 2500 రూపాయలను సైతం ఆర్థిక సహాయం కింద అందించబోతోందని త్వరలోనే ఈ రెండు పథకాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముహూర్తం ఖరారు చేశారని తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ హామీల గురించి ఎక్కువగా ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని కూడా అమలు చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ తెలిపారు. అయితే ఈ హామీలను అమలు చేయడానికి అవసరమైన బడ్జెట్ ను సమకూర్చే పనిలోనే ఉన్నామంటూ తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు.. ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాలు సమయం ఉంది. మిగిలిన హామీలను మరి కొన్ని నెలలలోనే అమలు చేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కూడా మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందంటూ తెలిపారు మాజీ మంత్రి జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గెలిపిస్తే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ద్వారానే జూబ్లీహిల్స్ ప్రాంతానికి నిధులు తెచ్చి అవసరమైన పనులను చేయించుకోవచ్చంటూ తెలిపారు. ప్రజలు ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతిపక్ష నేతలను గెలిపిస్తే అభివృద్ధికి ఎటువంటి ఆస్కారం ఉండదంటూ తెలిపారు.