సీఎం చంద్రబాబు: మరో సంచలన నిర్ణయం..48 మంది ఎమ్మెల్యేకు నోటిస్..!
పెన్షన్ పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత కార్యక్రమంలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రోగ్రామ్ కమిటీకి ఆదేశాలను జారీ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా సీఎం చంద్రబాబు ఫైర్ అయినట్లు వినిపిస్తున్నాయి. పేదల సేవలో భాగంగా పింఛని పంపిణీలలో మంత్రులు, ఎమ్మెల్యేలు కచ్చితంగా పాల్గొనాల్సిందే అంటూ స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేశారు. అలా పాల్గొనని ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి మరి వివరణ ఇవ్వాల్సిందే అంటూ హెచ్చరించారు. కార్యకర్తలకు భీమా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందే అంటూ ఆదేశాలను జారీ చేశారు.
కూటమిలో భాగంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా నచ్చని కార్యకర్తలనే కాకుండా సిన్సియర్గా ఉన్న కార్యకర్తలను కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలని ప్రతి శుక్రవారం కూడా ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలలో జరిగేటటువంటి ప్రజా విజ్ఞప్తుల విషయంలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందే అంటూ తెలియజేశారు. ఎవరైనా పాల్గొనకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం గతంలో కంటే మరింత ఎక్కువగా చేస్తోందని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలి అంటూ తెలియజేశారు. అలా హాజరు కాని ఎమ్మెల్యేలకు సంబంధించి లిస్టు పార్టీ దృష్టికి రావడంతో 48 మంది ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.