బిగ్ అలర్ట్: ఇదే చివరి అవకాశం..అలా చేయకుంటే ఏపీలో రేషన్ కార్డులు రద్దు..!
స్మార్ట్ కార్డుల పంపిణీ చేసిన విషయం కూడా తెలిసిందే .రాష్ట్రవ్యాప్తంగా ఆయా రేషన్ షాపుల పరిధిలో ఉండేటువంటి వారందరితో కూడా ఈ కేవైసి ప్రక్రియను పూర్తి చేయించాలని తెలియజేసింది. లేకపోతే డిసెంబర్ నెల నుంచి వారి రేషన్ కార్డులను రద్దు చేస్తామంటూ తెలిపారు. ప్రభుత్వ రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నూనె, కంది పప్పు వంటివి అందిస్తోంది. వీటితో పాటుగా రేషన్ కార్డు సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క సభ్యులకు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం తెలియజేస్తోంది.
రేషన్ కార్డులను సభ్యులు చాలామంది ఈ కేవైసీ పెండింగ్లో ఉండడంతో ఇప్పటికే చాలాసార్లు ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. ఇంకా లక్ష మందికి పైగా ఈ కేవైసీ చేయించుకోలేదట. వారందరికీ ఇప్పుడు మరో అవకాశం కల్పించినట్లు తెలియజేస్తున్నారు. అందుకే నవంబర్ చివరి నాటికి ఈ కేవైసీ ప్రతి ఒక్కరు చేయించుకోవాలని తెలిపారు. నిజానికి అక్టోబర్ చివరి తేదీన ఈ ప్రక్రియ ముగియనుండగా ప్రభుత్వం మళ్ళీ గడువు పెంచింది. గడువు పెంచి వారం అవుతూ ఉన్న ఇప్పటివరకు ఆ లక్ష కార్డులకు సంబంధించి ఈ కేవైసీనే జరగలేదట. కేవలం డీలర్ల వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని ఆ వెంటనే రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ కూడా పూర్తి అవుతుందని తెలిపిన ఎవరు పట్టించుకోవడంలేదట. దగ్గరలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలుపుతున్నారు. చేయని యెడల రేషన్ కార్డు రద్దు అవుతుందని తెలిపారు.