కేటీఆర్ కుట్రలు.. కవితపై గులాబీ పార్టీ నేతల తిరుగుబాటు?

Veldandi Saikiran

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంతా కల్వకుంట్ల కవిత రాసిన లేఖ గురించే చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీలో.. ముసలం నెలకొందా? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది? కన్న తండ్రి పైన కల్వకుంట్ల కవిత తిరుగుబాటు చేస్తున్నారా ? ఆమె లేఖ వెనుక ఎవరు ఉన్నారు ? అని చర్చ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలోనే లేఖ పైన తాజాగా కల్వకుంట్ల కవిత స్వయంగా స్పందించారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. చాలా గొప్ప నాయకుడు అంటూనే ఆయన పార్టీ పై విమర్శలు చేశారు కవిత.

 కల్వకుంట్ల చంద్రశేఖర రావు చుట్టూ దెయ్యాలు ఉన్నాయని... ఆయన మాత్రం దేవుడు అంటూ వ్యాఖ్యానించారు. నేను రాసిన.. అంతర్గత లేఖను ఎవరు బయటపెట్టారు... గులాబీ నేతల కుట్రలు ఇందులో ఉన్నాయని ఆమె చెప్పకనే చెప్పారు. అంతేకాదు అమెరికా నుంచి నిన్న శంషాబాద్ లో దిగిన కల్వకుంట్ల కవిత కోసం... గులాబీ పార్టీ నేతలు ఎవరు వెళ్లలేదు. ఆ పార్టీకి సంబంధించిన... కీలక నేతలు కచ్చితంగా.. కవిత ఎక్కడికి వెళ్లినా వెళ్తారు.

 కానీ తాజాగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  శంషాబాద్ ఎయిర్పోర్టులో కవిత దిగితే... జాగృతి నేతలు అలాగే మహిళా నేతలు తప్ప... గులాబీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరూ లేరు. దీంతో కేటీఆర్ ఆదేశాల మేరకు... కవిత దగ్గరికి ఎవరు కూడా వెళ్లలేదని చెబుతున్నారు. పార్టీ లైన్ బ్రేక్ చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది గులాబీ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు... గులాబీ పార్టీ నేతలు ఎవరు వెళ్లకపోవడంతో.. గ్యాప్ బాగానే ఉందని చెబుతున్నారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: