
స్మిత సబర్వాల్ కారు అద్దె 63 లక్షలా?
అయితే ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయారో... అప్పటినుంచి స్మితా సబర్వాల్ కు కష్టాలు మొదలయ్యాయి. ఆమె ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో దివ్యాంగుల విషయంలో విభాగం రాజుకుంది. అయితే ఆ వివాదం చల్లబడిన తర్వాత... ప్రభుత్వంలో సైలెంట్ గా పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంది స్మిత. తాజాగా... ఈ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరో వివాదంలో ఇరుక్కున్నారు.
ఆమె అద్దకు తీసుకున్న ఓ కారు... రెంట్ విషయంలో 61 లక్షల అవకతవకలు జరిగినట్లు తాజాగా ఆడిట్లో తేలిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆ నిధులను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి చెల్లించేలా ఆమెకు నోటీసులు ఇవ్వబోతున్నారట. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా... ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం రెండు రోజుల్లో ఆమెకు నోటీసులు అందే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో... అద్దెకు ఓ కారును తీసుకున్నారు స్మిత సబర్వాల్. ఆమె ఇచ్చిన లేఖ ప్రకారం 2016 నుంచి 2024 మార్చి వరకు ఒక కారును అద్దెకు తీసుకున్నారట. ఆ కారు అద్దె నెలకు... 63 వేల రూపాయలు ఉంటుందని.. ఆ డబ్బును యూనివర్సిటీ నుంచి స్మితా సబర్వాల్ తీసుకున్నట్లు తెలిసింది. అలా 90 నెలల పాటు... 61 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆడిట్ అధికారులు తాజాగా ఈ విషయాన్ని తేల్చారట. ఈ డబ్బును తిరిగి చెల్లించాలని నోటీసులు కూడా ఇవ్వబోతున్నారట.