కొడాలి నాని, వంశీ అడ్రస్ ఎక్కడ.... ఎక్కడ మాయం అయ్యారు..?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం వార్తల్లో ఉన్న నాయకులలో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉంటారు. గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. గన్నవరం నుంచి టిడిపి తరఫున వరుసగా రెండుసార్లు గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత జగన్ కు దగ్గరయ్యారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై చాలా అభ్యంతరకరమైన కామెంట్ చేసి టిడిపికి శత్రువు అయ్యారు. కొడాలి నాని చంద్రబాబు .. ఆయన తనయుడు లోకేష్ పై ఏనాడు మర్యాదగా మాట్లాడిన సందర్భం లేదు. కొడాలి నాని తిట్లు వైసీపీ శ్రేణులకు విన సొంపుగా ఉండేవి. కొడాలి నానిని వైసిపి బాగా ఎంకరేజ్ చేసేది. ఆ తర్వాత వల్లభనేని వంశీ కూడా అదే పంథా లో ముందుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు వైసిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
వైసిపి ఓడిపోయిన తర్వాత ఈ ఇద్దరు నాయకులు ఏమయ్యారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. నాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయిన ఈ ఇద్దరు నేతలు ఎక్కడ దాక్కున్నారు అన్న సెటైర్లు పెడుతున్నాయి. అధికారం శాశ్వతం కాదని తెలిసి కూడా విర్రవీగి నోటుకి వచ్చినట్టు తిట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ? అన్న భయంతో ఆంధ్ర ప్రదేశ్ విడిచి తమ సొంత నియోజకవర్గం విడిచిపెట్టారు. ఇలాగైతే గుడివాడలో నాని - గన్నవరంలో వంశీ ఎలా రాజకీయం చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏనాడు వీరి మాటలను వీరిని కంట్రోల్ చేయాలని అనుకోలేదు. అందుకే నేడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. మరోవైపు కొడాలి నాని కంచుకోట లాంటి గుడివాడలో రోజు రోజుకు టిడిపి బలపడుతుంది. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ భవిష్యత్తు ఏమిటో ఆయనకే తెలియాలి.