టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అందులో కొన్ని సినిమాలను వదులుకున్నందుకు గల కారణాలను కూడా ఈయన ఓపెన్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఈ మూవీ తోనే బోయపాటి శ్రీను దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కథను మొదట బోయపాటి శ్రీను , జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు. కానీ ఆయన ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. ఒకానొక ఈవెంట్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ "భద్ర" సినిమాను రిజెక్ట్ చేసిన విషయాన్ని తెలియజేశాడు. కొంత కాలం క్రితం తారక్ ఓ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ ... భద్ర సినిమా కథను బోయపాటి శ్రీను నాకు వినిపించాడు. ఆయన కథ చెప్పేటప్పుడు అద్భుతంగా కథను వివరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలో సన్నివేశం ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో మన కళ్ళ ముందు కథ చెప్పేటప్పుడు రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు.
అలా చూపించే విధానం వల్ల మనకు భయం కూడా వేస్తోంది అని చెప్పాడు. అలాగే ఆ సమయంలో నాకు భద్ర కథ నచ్చకపోవడం వల్లనో , మరి ఏ కారణాల వల్లో కానీ నేను ఆ సినిమా కథను రిజెక్ట్ చేశాను. ఆ కథను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను అని తారక్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే తారక్ , బోయపాటి శ్రీను కాంబోలో దమ్ము అనే మూవీ వచ్చింది. కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.