గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ రికార్డు కి రంగం సిద్ధం.. ఏకంగా..?
ఇందుకు సంబంధించి అనుగుణంగానే అడుగులు వేస్తున్నారట.. ప్రచారానికి సంబంధించి ఒక కీలకమైన స్టెప్ వేయడం జరిగింది.. డిసెంబర్ 29వ తారీకుకి భారతదేశంలోని అతి పెద్దదైనటువంటి రామ్ చరణ్ కటౌట్ పెట్టబోతున్నారట. అది కూడా విజయవాడలోని బృందావనం కాలనీలో వజ్ర గ్రౌండ్లో పెట్టబోతున్నారట. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారట. ఈ విషయానికి సంబంధించి గేమ్ చేంజర్ మేకర్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దేశంలోని హైయెస్ట్ రికార్డు స్థాయి కటౌట్ పెట్టబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.
డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా వచ్చేయేడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ తోనే సిద్ధమయ్యారు.. సుమారుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమా విడుదల చేయడం వాయిదా పడింది. మొత్తానికి గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం అటు అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇందులో కీయారా అద్వానీ , అంజలి ఇలాంటివారు హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. రామ్ చరణ్ కూడా ఇందులో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పాటలను విడుదల చేయగా అబ్బురపరిచేలా ఉన్నాయి. మరి మొత్తానికి ట్రైలర్ తో ఏ విధంగా ఈ సినిమా హైప్ ను పెంచి ఎలాంటి రికార్డులను తిరగరాసేలా చేస్తుందో చూడాలి మరి.