ఆంధ్రప్రదేశ్ లో 2024 చరిత్రలో నిలిచిపోయే ఏడాది అవుతుంది.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంతో ఉత్కంఠత రేపాయి..కూటమి పార్టీలు అయినా టీడీపీ, జనసేన, బీజేపీ తో ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య హోరాహోరి పోరు జరిగింది.. ఈ ఎన్నికలలో గెలిచేందుకు వైసీపీ పార్టీ సరికొత్త విధానాలతో ముందుకు వెళ్ళింది..కానీ ప్రజలలో ఒకప్పటి విశ్వాసం కోల్పోయింది.. 5 సంవత్సరాలకె ప్రజలకి వైసీపీ పార్టీ పై నమ్మకం పోయింది. దీనితో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ పార్టీ పై కూటమి సంచలన విజయం సాధించింది.. అయితే రాష్ట్రంలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వడానికి కొన్ని బలమైన కారణాలు వున్నాయి..అప్పటి ముఖ్యమంత్రి జగన్ మొండి పట్టుదల ఒక కారణం అయితే ఐ ప్యాక్ సర్వేతో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం, అలాగే కొంతమంది సీనియర్ నాయకులకు టికెట్ ఇవ్వకపోవడం వంటివి చాలా తప్పులు చేసింది.. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం లోక్ సభ స్థానం విషయంలో జరిగిన రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..
2019 ఎన్నికలలో వైసీపీ తరుపున నిలబడిన లావు కృష్ణదేవ రాయలు మంచి మెజారిటీతో విజయం సాధించారు.. గత ఐదేళ్లుగా అయనపై ఎలాంటి ఆరోపణలు లేవు.. పైగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయన పార్లమెంట్ లో గట్టిగా వాదించి రాష్ట్రానికి కావాల్సిన నిధులు సాధించారు.. అంతటి గొప్ప లీడర్ ని వైసీపీ పార్టీ పల్నాడు నుంచి గుంటూరుకి బదిలీ చేయాలనీ చూసింది.. దానికి అంగీకరించని కృష్ణదేవరాయలు, ఆయన వర్గం జగన్ ను పలు మార్లు కలిశారు.. పల్నాడు సీటును స్థానికులకి ఇవ్వాలని జగన్ ఆలోచన.. అలాగే స్థానికతలో భాగంగా లావుని గుంటూరు ఎంపిగా పోటీ చేయించాలని అనుకున్నారు.. కానీ దానికి లావు ఒప్పుకోలేదు..చర్చలు విఫలం కావడంతో లావు వైసీపీ పార్టీని వీడి టీడీపీ లో జాయిన్ అయ్యారు..పల్నాడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తిరుగులేని విజయం సాధించారు.. పల్నాడు ప్రాంతంలో స్థానిక వ్యక్తికే ఎక్కువ మెజారిటీ లభిస్తుందనే చరిత్రను లావు కృష్ణదేవరాయలు బ్రేక్ చేసారు..