దెబ్బకు పడిపోయిన హీరోయిన్స్ రెమ్యూనరేషన్.. యంగ్ హీరోయిన్లకి కొత్త కష్టాలు..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా కొనసాగించిన ముద్దుగుమ్మలకు కొంత కాలం క్రితం వరకు కోట్లలో పారితోషకాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి . స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దు గుమ్మ లకు వారు డిమాండ్ చేసినంత పారితోషకాన్ని ఇవ్వడానికి నిర్మాతలు కూడా చాలా వరకు వెనక్కు వెళ్లలేదు . దానితో స్టార్ హీరోయిన్లు అద్భుతమైన పారితోషకాన్ని తీసుకుంటూ కెరీర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగించారు. ఇక హీరోయిన్లు అడిగినంత రెమ్యూనషన్లను నిర్మాతలు ఇవ్వడానికి ప్రధాన కారణం.

వారికి థియేటర్ బిజినెస్ తో పాటు నాన్ థియేటర్ బిజినెస్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు రావడమే. అందులో మరీ ముఖ్యంగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు పెద్ద మొత్తంలో సినిమాలకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ద్వారా నిర్మాతలకు కూడా సినిమా ద్వారా భారీగా డబ్బులు రావడం వల్ల వారు హీరోయిన్లు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారు అని తెలుస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు కూడా ఓ సినిమాకు పెద్ద ధర పెట్టాలి అంటే అనేక సార్లు ఆలోచిస్తున్నట్లు చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు ఎక్కువ శాతం తక్కువ డబ్బులకే సినిమాలను కొనుగోలు చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దానితో కొన్ని సినిమాలకు ఓ టీ టీ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు రాకపోవడంతో హీరోయిన్స్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు ముందుకు రావడం లేదు అని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన వారు చాలా సినిమాలతో పెద్ద మొత్తంలో పారితోషకాలను తీసుకున్నారు. కానీ ఇప్పుడే స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగిన ముద్దుగుమ్మలకు ఆ స్థాయి పారితోషకాలు లభించే అవకాశం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: