హెరాల్డ్ పాలిటిక్స్ 2024: వార్డు మెంబర్ గెలవలేదు..కానీ "మంగళగిరి" హీరో అయ్యాడు ?
మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసిపి చేతిలో... చిత్తుగా ఓడిపోయాడు నారా లోకేష్. అయితే ఓడిపోయిన చోటే మళ్లీ... నిలబడాలనే కసితో... నారా లోకేష్ మరోసారి... అక్కడి నుంచే నిలబడి గెలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా... మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పోటీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 91 వేల మెజారిటీతో... వైసిపి అభ్యర్థి పై నారా లోకేష్ విజయం సాధించారు.
దీంతో అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టారు నారా లోకేష్. అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం నారా లోకేష్ కు ఉంది. 2014 సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పుడు నారా లోకేష్ కు... ఎమ్మెల్సీ పదవి ఇచ్చి... మంత్రి పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత పార్టీలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. అయితే... వార్డు మెంబర్గా కూడా గెలవని... నారా లోకేష్... తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపిస్తారని వైసీపీ చాలాసార్లు విమర్శలు చేసింది.
అయితే వాటన్నిటినీ మనసులో పెట్టుకున్న నారా లోకేష్... మళ్లీ మంగళగిరి నుంచి.. పోటీ చేసి కష్టపడి గెలిచాడు. అటు వైసిపి పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కారణంగా.... నారా లోకేష్ కు భారీ మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో... ఐటి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు నారా లోకేష్. చంద్రబాబు నాయుడు ఏజ్ పైబడడంతో.... పార్టీ మీటింగులు, పార్టీలో చేరికలు కూడా నారా లోకేష్ చూసుకుంటున్నారు. భవిష్యత్తు టిడిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా నారా లోకేష్ అని చాలామంది ప్రచారం చేస్తున్నారు.