మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటీమణి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఈటీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ షో ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ రావడంతో ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈమె మొదటగా నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది.
ఈ మూవీ లో ఈమె చిన్న పాత్రలో నటించిన తన నటనతో , అందంతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి కొన్ని సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంత కాలం క్రితం ఈమె పుష్ప పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ లో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. తాజాగా ఈమె నటించిన పుష్ప పార్ట్ 2 సినిమా విడుదల అయింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఓ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అనసూయకు ఇద్దరు కుమారులు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆ విషయంపై అనసూయ మాట్లాడుతూ ... నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ నాకు ఒక అమ్మాయి కావాలని ఉంది. ఒక అమ్మాయి ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. నాకు ఒక అమ్మాయి కావాలి ఉంది కానీ అందుకు నా భర్త సహకరించడం లేదు అంటూ కామెంట్స్ చేసింది. ఇలా అనసూయ తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.