ఏపీ: కడపలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫ్లెక్సీ..దడ పుట్టించిన కామన్ మ్యాన్..!
ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో సంపద సృష్టి విషయం జరగలేదని టిడిపి నేతలు ఇప్పటికి ఆరోపిస్తున్నారు. ఈ విషయం పైన ఇటీవలే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి కూడా ప్రశ్నించగా కేంద్ర ప్రభుత్వం కూడా వైసిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ అధికంగానే సంపద సృష్టించింది అంటూ కితాబ్ ఇచ్చింది. ఇలాంటి విషయంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యానర్ పేరు లేకుండా కలకలాన్ని సృష్టిస్తోంది. పలానా పార్టీ అని ఎక్కడ చెప్పకుండ అటు కేంద్రం ఇచ్చిన గుణాంకాలను తెలియజేస్తూ ఏపీకి సంబంధించిన ఆర్థిక సంవత్సర వివరాలను సైతం ఇందులో ముద్రించారు.
అయితే ఈ ఫ్లెక్సీ కడప జిల్లాలో వెలసినట్లు తెలుస్తోంది.. జగన్ కి చేసింది చెప్పుకోవడం చేతకావడం లేదనే అక్షరాలుగా కడప స్లాగ్ లో రాసుకుంటూ ఒక బ్యానర్ ని కట్టడంతో పాటు దాని కింద ఒక టేబుల్ వేసి గత చంద్రబాబు ప్రభుత్వంలో 2018-2019 లో వైయస్ జగన్ హయాంలో చివరి ఆర్థిక సంవత్సరంగా ఉన్నటువంటి 2023-2024 లో రాష్ట్రంలో నమోదైన వార్షిక ఆదాయాన్ని తెలియజేశారు. 2018-19 మధ్యలో చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర జాతీయోత్పత్తి 7.9 లక్షల కోట్లు ఉండగా..2013-2024 జగన్ హయాంలో 12.91 లక్షల కోట్లకు పెరిగింది అంటూ ఈ బ్యానర్లో తెలిపారు. అయితే ఫ్లెక్సీ చివరిలో ఉన్న ఈ పార్టీ వైసీపీకి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏదో ఫ్రెండ్షిప్ కోసమే చెబుతున్నాను అంటూ ముగించడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ బ్యానర్ కూడా వైరల్ గా మారింది