కీర్తి సురేష్ పెళ్లితో యాంకర్ రష్మికి ఉన్న లింక్ ఏంటి..? ఫ్యుజులు ఎగిరిపోయే మ్యాటర్ ఇది..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడో.. అంతకు డబుల్ స్థాయిలోనే యాంకర్ రష్మీ కూడా పాపులారిటీ అందుకుంది . మరీ ముఖ్యంగా సుధీర్ - రష్మీల మధ్య ఏదో ఉంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం వీళ్ల కెమిస్ట్రీ అనే చెప్పాలి. పెళ్లైన వాళ్ల మధ్య కూడా ఇంత కెమిస్ట్రీ ఉంటుందో లేదో చెప్పలేం. కానీ వీళ్ల మధ్య మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో మాత్రం రష్మి కి సంబంధించిన ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రష్మి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త హల్ చల్ చేస్తుంది . ఆయన ఆమెకు చిన్ననాటి స్నేహితుడు అంట కూడా తెలుస్తుంది. రీసెంట్ గానే హీరోయిన్ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ పిక్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు యాంకర్ రష్మీ కూడా తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. రష్మీ పెళ్లి వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. జానువరి ఆఖరి వారంలో రష్మి పెళ్ళి జరగబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి..!