అంబానీ ఆస్తుల నుంచి కృతి సనన్ ఎత్తు వరకు..? అలెక్సాను భారతీయులు అడిగిన ప్రశ్నలు ఇవే..!

lakhmi saranya
క్రికెట్ నుంచి సినిమాల వరకు, ముఖేష్ అంబానీ ఆస్తుల నుంచి కృతి సనం ఎత్తు వరకు ఇలా ఎన్నో ప్రశ్నలకు భారతీయులు అలెక్స్ సాయాన్ని కోరుతున్నారు. అప్డేట్స్తో పాటు జనరల్ నాలెడ్జ్, యుటిలిటీ, డెయిలీ లైఫ్ గురించి అడుగుతున్నారు. 2024 లో అలెక్సాను ఎక్కువగా అడిగినా ప్రశ్నలేమిటో ఇప్పుడు చూద్దాం. మరో రెండు వారాల్లో 2024 ముగియనుంది. కొత్త ఏడాదికి ప్రపంచమంతా స్వాగతం పలకనుంది. ఈ నేపథ్యంలో 2024 లో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను ఇండియన్స్ ఎంతగా ఉపయోగించారనే విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది.
ఏడాది మొత్తం ఏవో ప్రశ్నలకు ఎక్కువగా alexa సాయాన్ని తీసుకున్నారో చూద్దాం. అలెక్సాను అడిగిన ప్రశ్నల్లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించే అధికంగా ఉండటం విశేషం. కోహ్లీ నికర విలువ, అతని ఎత్తు, వయసు, భార్యకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. క్రికెట్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాకు సంబంధించిన అంశాల పైన ఎక్కువగానే అడిగారు. క్రికెట్ స్కోర్ల కోసమూ అలెక్సా పై ఆధారపడ్డారు. అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనాన్ ఎత్తు ఎంత? ముఖేష్ అంబానీ నికర విలువ ఎంత? అనే ప్రశ్నలు సైతం సంధించారు.
అలాగే రోజువారి వార్తలు, అప్డేట్లు కోసం alexa పై భారతీయ యూజర్లు ఎక్కువగా ఆధారపడ్డారు. జాతకాలు, పండగ తేదీలు, భూమిపై జనాభా ఎంత? భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత? వాటిని రెగ్యులర్ అడిగిన ప్రశ్నల్లో ఉన్నాయి. ఇక పాటల కోసం అయితే చెప్పనక్కర్లేదు. వినియోగదారుల ఇళ్లలో అలెక్స నిరంతర రేడియోగా మారిపోయింది. బత్తి పాటలు, బాలీవుడ్, పాప్ సంగీతాన్ని విన్నారు. హనుమాన్ చాలీసా, గాయత్రీ మంత్రం, రామ్ సియా రామ్ వంటి పాటల కోసం ఎక్కువగా సర్చ్ చేసారు. సినిమా పాటల విషయానికి వస్తే అనిమల్ చిత్రంలోని అబ్రార్ ఎంట్రి- జమాల్ కుడు, నాటు నాటు, ఇల్యుమీనటి, అఖియన్ వంటి బాలీవుడ్ హిట్స్ విన్నారు. అన్నిటికీ మించి వంటలు వండేందుకు సైతం అలెక్సా సాయాన్ని తీసుకోవటం కోసమేరుపు. అలెక్సా వివిధ రకాలకు ఉపయోగపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: