దిండును ఎన్ని రోజులకు మార్చుకోవాలి? లేదంటే ఏమౌవుతుంది?

lakhmi saranya
పడుకునేటప్పుడు కొంతమంది దిండిని అసలు ఉపయోగించరు. దిండి లేకుండానే కొంతమంది నిద్రిస్తూ ఉంటారు. మన ఆరోగ్యం విషయంలో పడకగది కూడా ఎంతో పాత్ర పోషిస్తుంది. బెడ్లు, దిండ్లు శుభ్రంగా ఉండటంతో పాటు సరైన సమయంలో వాటిని మార్చడం ద్వారా ఎన్నో సమస్యలను తప్పించుకోగలుగుతాం. ఎందుకంటే రోజు ఉపయోగించే దీంట్లో పై ఎన్నో రకాల బ్యాక్టీరియా, ఆయిల్, చర్మ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులు ఉంటాయి. అంతేకాకుండా పడుకున్నప్పుడు కంఫర్ట్ గా ఉండాలన్నా కనీసం వాటిని తరచూ మార్చడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మవ్యాధి నిపుణుల ప్రకారం పాత దిండ్లలో దుమ్ము, మైట్స్, ఆయిల్, మృత చర్మ కణాలు ఉంటాయి. ఇవి ఎలర్జీ, చర్మ సంబంధ వ్యాధులతో పాటు గజ్జిని కూడా కలిగించే అవకాశం ఉంది. అందుకే మనం రోజు ఉపయోగించే దిండ్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, దిండు సరైన షేప్ లో లేకపోయినా ఇబ్బందులు తప్పవు. వెన్నుముక, మెడ వంటి ప్రాంతాల్లో సమస్యలు వస్తాయి. వాటి అలైన్ మెంట్ లో తేడాలు వచ్చి తలనొప్పి, దీర్ఘకాలిక మెడ నొప్పి, బాడీ పోస్టర్ లోనూ మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు.
అందుకే దిండును కనీసం ఒకటి నుంచి రెండేళ్లకైనా మార్చడం ఎంతో అవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకముందే తిండు గట్టిపడిన, ఫాట్ గా అవడం లేదా రంగు మారితే వెంటనే మార్చాల్సిన అవసరం ఉంది. ఇలా దిండ్లు, బెడ్లను మార్చినప్పుడు వాటిని చెత్తలో పడేయకుండా ఉపయోగకరంగా వాడితే బాగుంటుంది. అంతే ఆశ్రమాలు లేదా జంతుశాలలకు ఇస్తే ఒకరికి సాయం చేయటంతో పాటు పర్యావరణ పరంగాను ఎంతో మేలు జరుగుతుంది. సింథటిక్స్ తో తయారుచేసిన దిండులను రిసైకిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకోసం కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. కాటన్ లేదా ఇతర ఆర్గానిక్ పదార్థాలతో తయారైనవి సహజంగానే డికంపోస్ అవుతాయని కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: