అశ్విన్ రిటైర్మెంట్.. ఇక ఆ టీంలో కోహ్లీ ఒక్కడే మిగిలున్నాడు?
అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రమే ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకుండా యాక్టివ్ క్రికెటర్ గా మిగిలి ఉన్నాడు అంటూ ఒక విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో అంటే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీమిండియా 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను ముద్దాడింది టీమిండియా. అయితే ఇలా ధోని సారథ్యంలో 2011 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో కేవలం ఒక్కరు మినహా మిగిలిన ప్లేయర్ లందరూ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించి మాజీలుగా మారిపోయారు.
మొన్నటి వరకు అశ్విన్, విరాట్ కోహ్లీలో మాత్రమే 2011 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో రిటైర్మెంట్ ప్రకటించకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లుగా ఉండేవారు. కానీ ఇటీవల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో రన్ మెషన్ విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో మిగిలిపోయారు. ఈ క్రమంలోనే అప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో టీం ప్లేయర్స్ అందరూ దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటోలో ఒక విరాట్ కోహ్లీనే హైలెట్ చేసి చూపించడం గమనార్హం. కాగా ఇప్పటికే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టి20 కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.