రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..ప్రభాస్ చేసిన పనికి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!
అయితే ఈ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ప్రభాస్ ప్రవర్తన. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్. అయినప్పటికీ, ఆ స్టార్‌డమ్‌ను ఎక్కడా ప్రదర్శించకుండా, ఎంతో సింపుల్‌గా, వినయంగా వ్యవహరించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.ఈవెంట్ అంతా ప్రభాస్ చాలా కూల్‌గా, నవ్వుతూ, చిత్రబృందంలోని ప్రతి ఒక్కరితో కలివిడిగా మాట్లాడారు. ముఖ్యంగా హీరోయిన్స్‌తో సరదాగా జోవియల్‌గా సంభాషించడం, స్టేజ్‌పై వారి మాటలకు స్పందిస్తూ నవ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ప్రభాస్ చాలా రిజర్వ్డ్ పర్సన్‌గా ఉంటారని తెలిసిన అభిమానులు, ఈ రకమైన బిహేవియర్‌ను చూసి “ఇది ప్రభాస్ దగ్గర నుంచి ఊహించలేకపోయాం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ సింప్లిసిటీ, ఆయనలోని మానవీయత, ఇతరులను గౌరవించే తీరుపై అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఇదే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ‘రాజాసాబ్’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎదురైన అసహజ పరిస్థితులు పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌లో కొంతమంది అభిమానులు చేసిన వ్యవహారం ఆమెను తీవ్రంగా ఇబ్బందిపెట్టింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అదే సమయంలో హీరోయిన్ల డ్రస్ సెన్స్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో, ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రశాంతంగా, మర్యాదగా జరగడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి, స్టార్‌డమ్ ఉన్నా గర్వం లేకుండా, సింప్లిసిటీతో ప్రభాస్ చూపిన ప్రవర్తనే ఈ ఈవెంట్‌కు హైలైట్‌గా మారింది.