నారా భువనేశ్వరి స్పెషల్ అదే..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విజయాలలో కచ్చితంగా నారా భువనేశ్వరి హస్తం ఉండనే ఉంటుంది. అన్ని విషయాలలో చంద్రబాబుకి సపోర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇమే స్పెషల్ ఏమిటంటే సామాజిక సేవ చేయడం ,ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం, మహిళా సాధికారిక కార్యక్రమాలు వంటివి చేపడుతూ ఉంటుంది. కష్ట సమయాలలో ప్రజలకు ధైర్యం చెబుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారు. అందుకే టిడిపి నేతలకు, కార్యకర్తలకు నారా భువనేశ్వరి అంటే స్పెషల్ అని చెప్పవచ్చు.



భువనేశ్వరి అటు పుట్టినిల్లు మెట్టినిల్లు విషయంలో కూడా చాలా బాధ్యతగానే వ్యవహరిస్తుంది. ఒకపక్క కుప్పంలో ఇల్లు నిర్మాణ పనుల నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తన పదవి పనులలో ఉన్నప్పటికీ అక్కడ తరచూ వెళ్లడం, అక్కడ ఉండే కార్యకర్తలను పలకరించడం,వారికి కావలసిన పనులను చేయించి పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. కుప్పం అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలలో ముందుంటుంది భువనేశ్వరి. 2024 ఎన్నికల సమయాలలో కూడా తన భర్త (చంద్రబాబు నాయుడు) దగ్గరుండి మరి గెలిపించింది. అలా మెట్టినిల్లు గౌరవాన్ని భర్త గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో మాత్రం సిన్సియర్ గానే కష్టపడుతుంది.


అలాగే తన తండ్రి సొంత ఊరు అయిన నిమ్మకూరులో అక్కడికి వచ్చి పలు కార్యక్రమాలలో పాల్గొని అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు భువనేశ్వరి. అనంతరం మాట్లాడుతూ.. సెలవులు వచ్చాయంటే చాలు నేరుగా తాము నిమ్మకూరుకే వచ్చేవాళ్ళమని , కారు కోసం చూడకుండా కేవలం ఆర్టీసీ బస్సులలో కూడా తిరిగే వాళ్ళమని, అలా థియేటర్లో సినిమాలు చూసి మరి ఇంటికి వెళ్లే వాళ్ళమని అప్పట్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం  తల్లిదండ్రులైన ఎన్టీఆర్, బసవతారక విగ్రహాలకు కూడా నివాళులు అర్పించారు. రూ .6 కోట్లతో నాబార్డ్ వాళ్లు నిర్మించబోతున్నటువంటి 30 పడకల CHC భవనానికి భూమి పూజ చేశారు. అలాగే గురుకుల పాఠశాలకు కంప్యూటర్లు, రూ .3 కోట్లతో నిర్మించే బాయ్స్ హాస్టళ్లను శంకుస్థాపన చేశారు. అనంతరం కొద్దిసేపు అక్కడ విద్యార్థులు ,గ్రామస్తులతో కూడా ముచ్చటించారు భువనేశ్వరి. దీని ద్వారా పుట్టింటికి, మెట్టినింటికి చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగానే సేవ చేసుకొస్తున్నారు భువనేశ్వరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: