కిడ్నీలో రాళ్లు ఉన్నాయా.. ఆ ఆహారాల జోలికి పోకండి.!

lakhmi saranya
చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ సమస్య మరింతగా పెరిగిపోయింది. స్టోన్స్ వచ్చినవారు కొన్ని ఆహారాలని తీసుకోకపోవడం మంచిది. ఈ మధ్యకాలంలో కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. వాటిల్లో కిడ్నీలో రాళ్లు కూడా ఒకటి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామందికి తెలియక కొన్ని రకాల ఆహారాలు తినేస్తారు. దీనివల్ల ప్రాణాల మీదకు వస్తుంది. శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా పని చేస్తేనే బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
కిడ్నీలో ఎలాంటి మార్పులు వచ్చినా.. ఇతర బాడీ పార్ట్స్ లో కూడా మార్పులు రావడం ఖాయం. చాలామంది ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే రాళ్లు పెరిగి.. ప్రాణానికే ప్రమాదంగా మారతాయి. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. పల్చని మజ్జిగ, బార్లీ నీళ్లు, చియా సీడ్స్ వాటర్, పాల పదార్థాలు వంటివి తీసుకోవడం మంచిది. అలాగే విటమిన్ బి6 ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇది రాళ్లలో ఉండే ఆక్సలేట్స్ ని కరిగిస్తాయి.
అరటి పండ్లు, అవకాడో, ఓట్స్, సోయా బీన్స్, మామిడికాయల్లో విటమిన్ బి6 ఉంటుంది. క్యారెట్, కాకరకాయ, పప్పు ధాన్యాలు, బియ్యం వంటివి తీసుకుంటే మంచిది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఇప్పుడు చెప్పే ఆహారాలను అసలు దగ్గరకు కూడా రానివ్వకండి. దీనివలన రాళ్లు అసలు కరగవు. బీట్ రూట్, టమాటా, పాలకూర, క్యాబేజీ, వంకాయ, బంగాళదుంప, చాక్లెట్స్ వంటివి తినకూడదు. అలాగే జంక్ ఫుడ్స్, చిప్స్, పచ్చళ్లను దగ్గరకు రానివ్వకండి. మాంసాహార పదార్థాలను కూడా చాలా తక్కువగా తినాలి. సిట్రికి యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ద్రాక్ష పండు జ్యూస్, శీతల పానీయాలు, క్రాన్ బెర్రీ జ్యూస్ తాగకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: