మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి.. రోజా స్థానం భర్తీ ?

Veldandi Saikiran
మెగా బ్రదర్, జనసేన పార్టీ కీలక నాయకులు నాగబాబుకు బంపర్ ఆఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో నాగబాబుకు... ఎట్టకేలకు పదవి దక్కబోతుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కు... చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి రాబోతుందట. త్వరలోనే చంద్రబాబు కూటమి కేబినెట్ లోకి నాగబాబును తీసుకోబోతున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

 అయితే ప్రస్తుతం సాధారణ జనసేన నాయకుడిగా నాగబాబు కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన మంత్రి పదవి చేపట్టాలంటే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాల్సిందే.  ప్రస్తుతం ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు కాబట్టి ఎమ్మెల్సీ... ఇచ్చి కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగబాబు ను కేబినెట్ లోకి తీసుకుంటే...  సినిమాటో గ్రఫీ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
 అది కాకపోతే... గతంలో రోజా చేసిన పర్యాటక శా ఖ మంత్రి పదవి... నాగబాబును వరించే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నాగబాబు కేబినెట్ లోకి వస్తారని... ఓ వార్త వైరల్ కాగానే... ఆయనకు ఇచ్చే శాఖ పైన కూడా చాలామంది చర్చ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు మెగా బ్రదర్ నాగబాబు.
 దాదాపు పది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి నడిచారు. కష్టం, నష్టం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తో నిలబడ్డారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా జనసేనతో నడిచి పవన్ కళ్యాణ్  ను నిలబెట్టారు మెగా బ్రదర్ నాగబాబు.  అయితే మొన్నటి వరకు టిటిడి చైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది.  కానీ ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ మంత్రి పదవి... ఇవ్వబోతున్నారని చర్చ ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: