ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం గురించి ప్రచారం చేయాలని కూటమిలో ఉండే నేతలకు సైతం ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఆరు నెలలు కావస్తున్నప్పటికీ ప్రజలు ఏం చేశారనే విషయం పైన వివరించాలన్నట్లుగా నేతలకు సైతం సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నారట..అయితే ఇదంతా కూడా వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి వెళ్లడానికి సంక్రాంతి నుంచి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో కూటమి నేతలని సీఎం చంద్రబాబు యాక్టివ్ చేసేలా ప్లాన్ చేశారట.

దీంతో ప్రతిపక్ష నాయకుడు ప్రజలలోకి వెళితే కచ్చితంగా అధికార ప్రభుత్వానికి సెగ ఉండెనే ఉంటుంది. అలాగే ప్రజలు మరిచిపోయిన అంశాలను కూడా ప్రతిపక్షాలు కచ్చితంగా గుర్తుకు చేస్తాయి.. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు జగన్ సర్కార్ పై మద్య, ఇసుక వంటి పాలసీల పైన తీవ్ర వ్యతిరేకత సృష్టించేలా చేశారు. ఇప్పుడు ఇదే పని కూడా జగన్ కేవలం 6 నెలల్లోనే చేసేలా ప్లాన్ చేస్తున్నారు..

జగన్ ప్రజల మధ్యకు వస్తే ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలపై మాట్లాడుతారని ఆ సమయంలోనే పన్నుల బాదుడు, విద్యుత్ చార్జీల భారం వంటి వాటి పైన కూడా మాట్లాడుతారని ఒక రకంగా కూటమి ఎన్ని చేసినా కూడా ఒక్కసారి వ్యతిరేకత మొదలయ్యింది అంటే మళ్ళీ 2019 ఎన్నికల ముందు ఏం జరిగిందో అదే జరుగుతుందని అప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన ఎవరూ పట్టించుకోరని.. అందుకే జగన్ కంటే ముందుగానే కూటమి నేతలను సైతం ప్రజలలోకి వెళ్లాలని చంద్రబాబు నేతలను హెచ్చరిస్తున్నారట.. జగన్ జనంలోకి వెళ్లడానికి ముందే తమ ప్రోగ్రెస్ ను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నేతలకు చెప్పినప్పటికీ.. ఇప్పటివరకు ఇందుకు సంబంధించి పార్టీ నాయకులు,బిజెపి నేతలు ఎవరూ కూడా యాక్టివ్ గా ఉండలేదట.. చంద్రబాబు ఏం చేస్తారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: