ఆరోగ్యానికి ఈ నూనెలు బెస్ట్!

lakhmi saranya
వంటలు చేసేటప్పుడు రకరకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరికి ఏ నూనె నచ్చుతుందో ఆ నునే ఉపయోగిస్తూ ఉంటారు. వంటలు చేసేటప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన నూనె ఉపయోగిస్తుంటారు. వంటకాల రుచిని పెంచడంలో నూనెలు ముందుంటాయి అలవాట్లు, ప్రాంతాన్ని బట్టి నూనెలు వాడటం మారుతుంటాయి. కేవలం వంటకాలకు మాత్రమే కాకుండా సౌందర్యాన్ని పెంచి, ఆరోగ్యానికి మేలు చేయటంలో ఇది ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే పోషకాల వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎలాంటి నూనెలు ఏమిటో ఇక్కడ చదివేయండి.
పల్లీలు ప్రతి ఒక్కరి వంట గదిలో దర్శనమిస్తాయి. ఇవి టేస్టీగా ఉండటమే కాదు, ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేరుశనగలు కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్లు, సోడియం ఇలా చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణ కి కూడా ఉపయోగపడతాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దీంతోపాటుగా చర్మంపై ముడతలు, వృద్ధాప్య సంకేతనాలను నివారిస్తుంది. ఇది వంటకాల్లో మాత్రమే కాదు సౌందర్య పోషణకు కూడా ఉపయోగపడుతుంది.
ఈ నూనెతో చర్మంపై మర్దన చేయటం వల్ల స్కిన్ తాజాగా, మృదువుగా మారుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు కీళ్ల నొప్పులు ఉన్న వారు ఈ ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ నూనె వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో హెల్ది ఫ్యాటి ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఈ నూనెతో శరీరానికి వర్ధనా చేయటం వల్ల శరీరంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. దీనివల్ల అలసట తగ్గుతుంది. ఇది మెకాళ్లు, కీళ్ల నొప్పులకు చక్కగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: