నిజంగా ఇది అన్ ఎక్స్పెక్టెడ్.. KKR కెప్టెన్ ఎవరో తెలుసా?
అయితే ఈ మెగా వేలంలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనగా రికార్డు స్థాయిలో ధర పలికారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడి మరి కోట్ల రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేశాయి అన్న విషయం తెలిసిందే ఇక కొన్ని జట్లు అయితే కెప్టెన్ల కోసం తెగ ఆరాటపడుతూ కొత్తవారిని జట్టులోకి తీసుకున్న ఉన్నాయి. అయితే కోల్కతా కెప్టెన్గా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ ను ఆ జట్టు వదులుకుంది. దీంతో లక్నో అతన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇక ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను 23.75 కోట్లకు ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరి కోల్కతా కొనుగోలు చేసింది.
ఇంత భారీ ధర పెట్టారు అంటే అతనికి కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఆ జట్టు యాజమాన్యం. ఏకంగా క్రికెటర్ అజింక్య రహానేకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్సీ అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ అయ్యర్ కు భారీ ధర పెట్టినప్పటికీ కెప్టెన్సీ విషయంలో ఎంతో అనుభవం ఉన్న రహానే వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు క్రికెట్ వర్గాల నుంచి సమాచారం. అయితే రహానే కు ఇప్పటికే టీమిండియా కు కెప్టెన్సీ వహించిన అనుభవంతో పాటు గతంలో ఐపీఎల్ లోని కొన్ని టీమ్స్ కి కూడా కెప్టెన్ గా ఉన్నాడు. ఇక దేశ వాళిలోనూ ముంబై జట్టును కెప్టెన్గా ముందుకు నడిపించాడు. ఇలా టైటిల్ కాపాడుకోవాలని ఉద్దేశంతో 1.50 కోట్లతో కొనుగోలు చేసిన రహానేకీ ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ అప్పగించింది అన్నది తెలుస్తుంది.