భోజనం తరువాతే కాదు..! ఈజీలకర్ర ని ఎప్పుడైనా తినవచ్చు!
దీనిని ఎప్పుడైనా తినవచ్చు. దీనిని తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. భారతీయ వంటకాల్లో సోంపుని వివిధ రకాలు ఉపయోగిస్తుంటారు. ఇందులో కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. సాధారణంగా భోజనం తరువాత అరుగుదల కోసం దీనిని తింటారు. కానీ, టిఫిన్, భోజనానికి మధ్య కొంచెం ఈ సోంపును తినటం వల్ల సాధారణంగా తినే దానికంటే కొంచెం తక్కువగా తింటారని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే సోంపు తిన్న తరువాత కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలిగి తక్కువగా తింటారు. ప్రతిరోజు మామూలూ టీ కాకుండా సోంపుతో చేసిన టీ తాగటం వల్ల మూత్ర సమస్యలు తగ్గుతాయి.
సోంపు అనేక జీర్ణ సమస్యల నుండి బయటపడడానికి ఇది సహాయపడుతుంది. ఉదయం టైమ్ లో దీనిని తినటం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశ్రమమం లభిస్తుంది. చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతుంటారు. ఉదయం పూట నీళ్లతో కానీ, డైరెట్ గా వాటిని తినటం వల్ల ఎముకలకు బలం వస్తుంది. సోంపులో ఉండే విటమిన్ సి, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయటంలో తోర్పడతాయి. అలసట లేకుండా మంచిగా నిద్ర పట్టాలంటే ఈ సోంపు గింజలు ఉపయోగపడతాయి. ప్రతిరోజు భోజనం తర్వాత వీటిని తినటం వల్ల రాత్రి హాయిగా నిద్రపోయి, ఉదయమునే చురుగ్గా పనిచేస్తారు.