స్త్రీ రూపంలో హనుమంతుడు.. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

frame స్త్రీ రూపంలో హనుమంతుడు.. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

praveen
భారతదేశంలో ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు విదేశీయులను సైతం ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఇక ఇండియాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కనిపించే ఆలయం హనుమాన్ ఆలయం. భారతదేశంలో అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా హనుమంతుడు బ్రహ్మచారి అన్న విషయం అందరికీ తెలుసు.

 అలాంటి హనుమంతుడిని ఇక్కడ మాత్రం ఏకంగా స్త్రీ రూపంలో పూజిస్తారు. చత్తీస్గడ్ లో ఈ ఆలయం ఉంది  బిలాస్పూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో రతన్పూర్ లో ఉంది ఈ ప్రత్యేకమైన ఆలయం. అయితే ఇలా హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజించడం వెనక పురాణ కథ కూడా ఉంది అన్నది తెలుస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే ఇలా హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజించే ఏకైక ఆలయం ఇదే కావడం గమనార్హం .  ఇక్కడి హనుమంతుడి విగ్రహం పదివేల సంవత్సరాల నాటిది అని చెబుతూ ఉంటారు.

 పృద్వి దేవ్ జూ అనే రాజు హనుమాన్ కి గొప్ప భక్తుడట. రతన్పూర్ను చాలా సంవత్సరాలుగా పాలించాడట   అతను కుష్టు వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఓ రోజు రాత్రి కలలో హనుమంతుడు కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. దీంతో రాజు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆలయ పనులు పూర్తవుతున్న సమయంలో హనుమంతుడు మళ్లీ రాజు కలలో కనిపించి మహామాయ కుండ్ నుంచి విగ్రహాన్ని బయటకు తీసి ఆలయంలో ప్రతిష్ట ఉంచమని కోరాడట. ఇక కలలో హనుమంతుడు చెప్పిన విధంగానే రాజు చెరువు నుంచి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్టించాడు  ఇక స్త్రీ రూపంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారట. తర్వాత ఇలా బయటకు వచ్చిన విగ్రహాన్ని పూర్తి పూజలతో ఆలయంలో ప్రతిష్టించారట. ఇక ఆ తర్వాత రాజు గారి అనారోగ్యం పూర్తిగా నయమైందట. ఇలా స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి వెనుక ఒక పెద్ద పురాణ కథ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: