ముంచుకొస్తున్న ముప్పు... ప్రాణాంతకంగా మారుతున్న బ్లీడింగ్ ఐ వైరస్!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఐ ఇన్ఫెక్షన్ అనేది మరీ ఎక్కువగా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా మహమ్మారి సృష్టించిన మరణ హోమాన్ని మర్చిపోకముందే మరో ముప్పు తరుముకోస్తుంది. అత్యంత ప్రమాదకరమైన మార్చర్గ్ వైరస్ ఇప్పుడు ఆప్టికల్ కంటి అయినా రువాండాలో  విధ్వసం సృష్టిస్తోంది. దీని బారిన పడి ఇప్పటికే 15 మంది మరణించారు. వందలాది మందికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిక జారీ చేసింది. మార్బర్గ్ వైరస్ సోకితే బాధితుల కళ్ళు నుంచి రక్తం కారడం ప్రారంభం అవుతుంది. దీని కారణం గానే ఈ వైరస్కు బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా పిలుస్తున్నారు. కాగా ఈ వైరస్ ను మొదటిసారి 1961లో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో కనుగొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. మార్చర్గ్ వైరస్ ఎబోలా ఫ్యామిలీకి చెందినది. ఇది వైరస్ హెమరేజిక్ ఫీవర్ కు కారణం అవుతుంది. ఇది సోకిన తరువాత ప్రజల రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అంతర్గత రక్త స్రావానికి, ముఖ్యంగా కళ్ళలో రక్తం కారడానికి కారణం అవుతుంది. కాగా ఇది జూనోటిక్ వైరస్ అని నిపుణులు పేర్కొంటున్నారు.
 ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మొదట గబ్బిలాల నుంచి ఉద్భవిస్తుంది. వాటి యూరిన్, లాలాజలం లేదా రక్తం ద్వారా కూడా మానవులకు వ్యాపిస్తుంది. మార్చర్గ్ వైరస్ లక్షణాలు కూడా ఎబోలా వైరస్ మాదిరిగానే ఉంటాయి. ఇది సోకిన తర్వాత బాధ్యత వ్యక్తుల్లో తీవ్రమైన జ్వరం,తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, శరీరంపై దద్దుర్లు వంటివి కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువ అంతర్గత రక్త శ్రవం, అవయవ వైఫల్యం సంభవిస్తాయి. అకస్మికంగా బరువు తగ్గడం, ముక్కు, కళ్లు, నోరు లేదా మహిళల్లో అయితే యోని నుంచి రక్త శ్రవం అయ్యే అవకాశం ఉంటుందని డబ్ల్యుహెచ్ఓ ఆరోగ్యం నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: