వైసీపీకి .. బీజేపీతో డిస్టెన్స్ ఇదే... !
అయితే ఇటీవల నెలలుగా మాత్రమే సూపర్ సిక్స్ అంశాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అంటే బీజేపీ ఎక్కడైనా ఒకే విధంగా వ్యవహరిస్తుంది. ఏ పార్టీని పూర్తిగా దూరం చేసుకోకుండా, అవసరమైన చోట ‘సావకాశాలు’ చూసుకుంటూ రాజకీయంగా ఎదగడమే దాని వ్యూహం. ఏపీలోనూ అదే ఫార్ములాను అనుసరిస్తోంది. గతంలో టీడీపీతోనూ, అవసరమైతే వైసీపీతోనూ పరోక్షంగా కలిసి రాజకీయాలు చేసిన అనుభవం బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రస్తుత పరిస్థితిని బీజేపీ పెద్దలు లోతుగా అంచనా వేసినట్టు సమాచారం. వైసీపీ పరిస్థితిలో తక్షణ మార్పులు కనిపించడం లేదని, పార్టీ ఇంకా పాత విధానాలకే పరిమితమై ఉందని బీజేపీ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి కూటమికే బలంగా నిలవాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పార్టీని మొదటి నుంచి వైఎస్.జగన్ నడిపిస్తున్నా ... ఆయన ఎక్కువగా సలహాదారులు, ఐప్యాక్ లాంటి వ్యూహాత్మక బృందాలపైనే ఆధారపడటం కొనసాగుతోంది. ఇది కొంతవరకు లాభం చేకూర్చినా, స్పష్టమైన సిద్ధాంతం లేకపోవడం పార్టీకి మైనస్‌గా మారిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికీ వైసీపీ అదే తరహా రాజకీయ వ్యూహాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మళ్లీ రాజకీయ వ్యూహకర్తల కోసం వెతుకుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితులను గమనిస్తున్న బీజేపీ, వైసీపీకి దూరంగా ఉంటూనే, ప్రస్తుత కూటమిని బలోపేతం చేయడమే సరైనదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ రాజకీయ పునరుత్థానం ఏ దిశగా సాగుతుందో, బీజేపీ వ్యూహాలపై అది ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.