పుష్ప 2 టికెట్ల ధరల పెంపు .. హైకోర్టు సంచల తీర్పు..!?

Amruth kumar
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవేటేడ్ మూవీ పుష్ప 2 మరో 48 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది .. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్‌ కేకుల అమ్ముడు పోతున్నాయి .. ఈ క్రమంలో పుష్ప 2 టికెట్ రేట్ల పెంపు పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది .. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టిక్కెట్ కు అదనం గా 800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టి కి తీసుకువెళ్లారు .. మంగళవారం కోర్టులో విచారణ జరిగింది .

ఈ సందర్భంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది సిద్దార్థ్ స్పందిస్తూ 'రెండు వారాలు సమయం కావాలి' అని కోరగా.. 'రెండు వారాలు అంటే సినిమా బెనిఫిట్ షో, సినిమా రిలీజ్ అయిపోతుంది' అంటూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ప్రతి వాదనలు చేశారు. సాయంత్రం ఆర్డర్ ఇస్తానంటూ జస్టిస్ విజయ్ సేన్ రెడీ బెంచ్ తెలిపింది. 'రూ.800 పెట్టీ సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడు. ఓ కుటుంబం నుంచి 10 మంది సినిమాకు వెళ్తే రూ.10 వేలు ఖర్చు చేయాల?' అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
తెలంగాణ హైకోర్టు చివరి నిమిషం లో సినిమా విడదలను అడ్డుకోలేమంటూ పుష్ప 2 సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చేసింది .. ఈ మేరకు సినిమా రిలీజ్ చేసేందుకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కు అనుమతి ఇచ్చింది  .. ఇక ఇదే క్రమంలో బెనిఫిట్ షో ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాల ను తమకు తెలియజేయాల ని నిర్మాత ల‌ను ఆదేశించింది. అలాగే బెనిఫిట్ షో వసూళ్ల పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ ను హైకోర్టు ఆదేశించింది .. అలాగే టికెట్ ధరల పెంపు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో లను సైతం పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది  .. ఇక తదుపరి విచారణ రెండు వాగరాలకు వాయిదా వేసింది . ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు ఇంకా రాలేదు. కాగా హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే ఉత్కంఠ అంద‌రిలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: