కనురెప్పలపై చుండ్రు... నిర్లక్ష్యం చేస్తే అంతే..!
కనురెప్పలపై బ్యాక్టీరియా ఎక్కువగా చెరిపోవటం వల్ల చుండ్రు ఏర్పడుతుంది. ఇది చర్మ గ్రందులను మూసుకుపోయేలా చేస్తుంది. ఇది ఎక్కువగా శరీరం నుంచి నూనె ఉత్పత్తి అయినప్పుడు లేదంటే ఆ ప్రాంతంలో శీలింధ్రాలు పెరిగినప్పుడు ఈ చుండ్రు వస్తుంది. కనురెప్పలపై చుండ్రు బయటికి కనిపించకపోయినా.. దీని కారణంగా కళ్ళు ఎర్రగా మారడం, కళ్ళలో మంట, కళ్ళలో నీరు, కాంతిని చూడలేకపోవటం వంటివి చుండ్రు ఉందని తెలుపుతాయి. చాలామందికి ఈ విషయం తెలియక దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ చిన్న చిన్న సంకేతనలను నిర్లక్ష్యం చేస్తే కంటి సమస్యలకు కారణం అవుతుంది. కంటిలో ఉన్న కార్నియా దెబ్బతినేలా చేస్తుంది.
అంతేకాదు దీనిని అలాగే వదిలేస్తే కండ్లకలక, కార్నియా వాపు వంటి దీర్ఘకాలిక కంటి ఇన్ఫెక్షన్లు ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలామంది కళ్ళలో దురద వచ్చినప్పుడు వాటిని ఎక్కువగా రుద్దటం చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కార్నియా బలహీన పడుతుంది. ఇది కంటి సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాంటాక్ లెన్స్ వాడుతున్న వారు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే లెన్స్ పై బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు ను కలిగిస్తుంది. అందుకే ప్రతిరోజు సునీతమైన క్లెన్సర్ తో కనురెప్పలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. నిద్రపోయే ముందు కళ్ళను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇలా చేయటం వల్ల కనురెప్పలపై చుండ్రు పేరుకుపోయే ఛాన్స్ ఉండదు.