
నమ్రత బర్త్ డే కు మహేష్ బాబు గొప్పపని.. ఏం చేశాడంటే?
మహేష్ బాబు తండ్రి కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెంలో నేడు హెల్త్ క్యాంప్‌ని నిర్వహించారు. ఆడవారిలో చాలా మందికి ఈ మధ్య గర్భాశయ క్యాన్సర్ కనిపిస్తుంది. దాన్ని నివారించేందుకు నేడు ఆయన ఆడవారికి టీకా ఇప్పించారు. ఆ గ్రామంలో ఉండే దాదాపు 70 మంది బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్‌ను ఇప్పించారు. అలాగే వారికి ఆరు నెలల తర్వాత రెండో వాక్సిన్ కూడా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వబోతున్నట్లు నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేసి.. కార్యక్రమంలో పలుపంచుకున్న టీం మెంబర్స్‌కి, నిపుణులందరికీ కృతజ్ఞతలు కూడా తెలిపింది.
ఇక మహేష్ బాబు ఇప్పటికే చాలా మంది చిన్న పిల్లలకు ఆయన ఫౌండేషన్ ద్వారా హార్ట్ ఆపరేషన్ లు చేయించారు. ఇక మహేష్ బాబు మరోసారి సూపర్ స్టార్ అని అనిపించుకున్నారంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ పూజా కార్యక్రమం కూడా ఇటీవల మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. అది ఏంటంటే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ఒక 20 నిమిషాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.