షూటింగ్ లోనే పీరియ‌డ్స్..ఆ హీరోయిన్‌ కష్టాలు!

Veldandi Saikiran
రవీనా టండన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న భారతీయ నటి రవీనా టండన్ . రవీనా టండన్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి విపరీతంగా అభిమానులు ఉన్నారు. హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది.

దీంతో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో సైతం చేసింది. టాండన్ పత్తర్ కే ఫూల్ (1991)తో తన నటన రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాకు గాను ఆమె నటనకు ఫిలింఫేర్ లక్స్ న్యూ ఫేస్ అవార్డును కైవసం చేసుకుంది. 9వ దశకంలో మోహ్రా(1994), కిలాడియన్ కా కిలాడి (1996), జిడ్డి (1997) వంటి అనేక వాణిజ్య విజయాలలో ఆమె ఒక భాగంగా నిలిచింది. అయితే రవీనా కెరీర్ లో ఓ సంఘటన గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

రవీనా టండన్ మోహ్ర సినిమా షూటింగ్ సమయంలో ఆమె పీరియడ్స్ లో ఉన్నారట. కానీ వర్షం పాట కావడంతో ఆ వర్షం ఫీల్ ఉండాలని చల్లని నీటిని వారిపై పోసారట. ఆ చల్లని నీటిలో మొత్తం రవీనా తడిసిపోయిందట. పీరియడ్స్ సమయంలో అలాంటి పాటలో నటించడానికి రవీనా అలా ఇబ్బంది పడిందట. ముఖ్యంగా రవీనా ఇలాంటి పాటలు చేయడానికి చాలా అసౌకర్యంగా భావిస్తారట.

కానీ ఈ పాటలో నటించడంలో తప్పు లేదని రవీనా టండన్ కు అనిపించి తనకి పీరియడ్స్ ఉన్నప్పటికీ ఈ పాట షూట్ చేసిందట. అనంతరం ఈ పాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయం తెలిసి అందరూ రవీనా టండన్ ను మెచ్చుకుంటున్నారు. పీరియడ్స్ అయినప్పటికీ ఇబ్బంది పడకుండా నటించిందని అభినందిస్తున్నారు. అంతేకాకుండా నటనపై తనకు ఉన్న ఆసక్తిని చూసి అందరూ గర్వపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: