ఏపీ: ఆదాని పై.. వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. రూ .100 కోట్ల పరువు నష్టం..!
కూటమి సర్కారు చేసే విమర్శలకు దీటుగానే సమాధానాలు చెబుతూ ఉన్నారు జగన్.. ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా కల్తీ జరిగిందని పలు రకాల ఆరోపణలు వినిపించిన ఆ తర్వాత వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వడంతో పై చేయి సాధించినట్లుగా కనిపించింది. అలాగే రాష్ట్రంలో అప్పు పై కూడా ప్రభుత్వం రోజుకు ఒక మాట చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో లెక్కలతో సహా వివరించి చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేయవలసి వస్తుందని ఇలా కూటమి ప్రభుత్వం రోజుకొక దుష్ప్రచారాన్ని తన మీదికి మోపుతోంది అంటూ తెలియజేశారు. సూపర్ సిక్స్ అమలు చేసే ఉద్దేశమే లేదంటే ఇటీవలే తెలియజేశారు.
అలాగే ఈ రోజున మరొకసారి మీడియా ముందుకు వచ్చి ఆదానీ నుంచి తాను 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని విద్యుత్ ఒప్పందాలు చేశారంటూ ఆరోపణలు రావడంతో.. దిమ్మతిరిగేలా సమాధానాన్ని తెలియజేశారు.. తన పేరు ఎస్బిఐ చార్జి సీట్లో ఎక్కడా కూడా లేదని తెలిపారు.. ఆదానికి రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయని ఆదానితో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని తనకు లంచం ఇచ్చారని ఎవరైనా ఆధారాలు ఉంటే వాస్తవాలు ఉంటే మాట్లాడండి లేకపోతే తన పరువు దెబ్బతీస్తున్న వారిపైన రూ .100 కోట్ల పరువు నష్టం కూడా వేస్తానంటూ హెచ్చరించారు. తనమీద ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారందరినీ కూడా వదిలిపెట్టను అంటూ హెచ్చరించారు మాజీ సీఎం జగన్.