పెళ్లి ఏ వయసులో చూసుకుంటే బెటరో తెలుసా..!
మెరుగైన జీవితానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. నిజానికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య పెళ్లి చేసుకుంటే పరస్పరం అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం లభిస్తుంది. దీనివల్ల విడాకులకు అవకాశం కూడా తగ్గుతుందని సైకాలజిస్టులు అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే తమ పిల్లలు కూడా వివాహానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేయటం ఉత్తమమని చెబుతున్నారు. దీనివల్ల వారి జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి. నేషనల్ సర్వే ఆఫ్ ఫ్యామిలీ గ్రోత్ స్టడి ప్రకారం...
32 ఏండ్ల కంటే ముందే పెళ్లిళ్లు చేసుకున్న జంటల్లో విడాకులు 11 శాతం తక్కువగా ఉంటుంది. కొందరు 30 నుంచి 40 ఏండ్ల మధ్య మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. కాగా అప్పటికే బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితుల నుంచి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే ఈ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలే ఉన్నాయ్ అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే అప్పటికే అధికంగా స్వతంత్రతను కూడా కలిగి ఉంటారు. పెళ్లి, జీవితం గురించి తగిన అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్ లో జరిగే వివాహాల్లో కుటుంబ పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఈ రోజుల్లో మరి ఆలస్యం చేయటం మంచిది కాదంటున్నారు నిపుణులు.