ఆ యంగ్ క్రికెటర్ తో అలా చేయాలని ఉంది.. ప్రగ్యా జైస్వాల్ కోరిక మామూలుగా లేదుగా..!
అయితే ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో చేసిన అఖండ సినిమాతో తన కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత కూడా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు .. దాంతో హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమలో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో తన అందాలు ఆరబోస్తూ అభిమానులను కట్టిపడేస్తుంది . అలాగే సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసే ఫోటోలకు మంచి కిక్ ఉంటుంది.
అయితే ఇప్పుడు తాజాగా ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .. ఓ స్టార్ క్రికెటర్ తో తనకు డేటింగ్ చేయాలని ఉంది అంటూ ఆమె చెప్పుకు వచ్చింది ఇంతకు ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అంటే.. మరెవరో కాదు యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్ తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది . గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో శుభ్మన్ డేటింగ్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఈ జంట తరచూ మీడియా కంట పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.