బుల్లి పిట్ట: పొరపాటున గూగుల్లో ఈ పదాలను సెర్చ్ చేస్తే జైలుకే..?

Divya
మనకు ఎలాంటి  ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే చిన్నపిల్లల నుంచి మొదలు ముసలివారు వరకు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ వెతికితే మనకి ఏదానికైనా సమాధానం దొరుకుతుందనే విధంగా చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు.ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇందులో సెర్చ్ చేస్తూ ఉంటాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంటర్నెట్ లేనిదే మనం ఏది తెలుసుకోలేం అన్నంతగా మారిపోయాము. అందుకే గూగుల్లో కొన్నిటిని సెర్చ్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలను విధించింది అవి ఏంటో తెలుసుకుందాం. వీటిని పొరపాటున కూడా సర్చ్ చేస్తే జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందట.

1).ఐటి నిబంధనల మేరకు పిల్లలకు సంబంధించిన అస్లీల కంటెంట్ను వెతకడం చేస్తే కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఫోక్సో చట్టం కింద కేసు నమోదయ్యేలా చేస్తుందట. ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందట.

2). ముఖ్యంగా ఎవరైనా అబార్షన్ కు సంబంధించి సమాచారాన్ని గూగుల్లో వెతికారు అంటే ఇబ్బందుల్లో పడతారు.. దీనికి సంబంధించి కఠినమైన చట్టాలు కూడా రూపొందించబడతాయి.

3). గూగుల్లో బాంబులు ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని సెర్చ్ చేసినా కూడా చిక్కుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుందట. ఇలా చేయడం వల్ల మీరు భద్రత ఏజెన్సీ నుంచి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

4). అలాగే టెర్రరిజానికి సంబంధించిన పదాలను కూడా గూగుల్లో వెతకకూడదట. ఇలాంటివి చేస్తే అరెస్టు చేయడం కూడా జరుగుతుందట.

5). అలాగే డ్రగ్స్ తయారీకి సంబంధించిన విషయాలను గూగుల్లో సెర్చ్ చేసిన కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయట..

ముఖ్యంగా మొబైల్ ని హ్యాక్ , సిస్టంలోని హ్యాక్ చేయడం వంటివి గూగుల్లో సర్చ్ చేసిన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. అలాగే ఎవరికైనా సంబంధించి ప్రైవేటు వీడియోలు ఫోటోలను గూగుల్లో అప్లోడ్ చేసిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: