హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: "నవీన్ నూలీ".. టాలీవుడ్ లో ఈ పేరు చాలా ఏండ్లు యాద్ ఉంటది..!
సినిమాలో ఎక్కడ సీన్ ట్రిమ్ చేయాలి, ఎక్కడ ఎమోషన్‌ను హైలైట్ చేయాలి, కథా ప్రవాహం ఎక్కడ స్లో అవుతోంది, ఎక్కడ పీక్స్ అవసరం అనేది పూర్తిగా ఎడిటర్ విజన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ కళలో తనదైన ముద్ర వేసుకున్న నవీన్ నూలీ, ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
2025లో ఆయన ఎడిటింగ్ చేసిన సినిమాలు..పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ ”, నాగ చైతన్య హీరోగా వచ్చిన “తండేల్”. రెండూ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాల్లో నవీన్ నూలీ ఇచ్చిన సీన్ కట్స్, పేసింగ్, ఎమోషనల్ ట్రాన్సిషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీక్వెన్సులైనా, సెంటిమెంట్ సీన్లైనా – ప్రతి ఫ్రేమ్‌లో ఆయన టచ్ స్పష్టంగా కనిపించింది.ఇక సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు కూడా నవీన్ నూలీ వర్క్‌కి బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. “సినిమా సక్సెస్‌లో ఎడిటింగ్ ఎంత కీలకమో ఈ సినిమాలు మరోసారి నిరూపించాయి” అనే మాట ఇండస్ట్రీలో బలంగా వినిపించింది.
సోషల్ మీడియాలోనూ నవీన్ నూలీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గణనీయంగా పెరిగింది. సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఆయన ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరగడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో “నవీన్ నూలీ… టాలీవుడ్లో ఈ పేరు చాలా ఏండ్లు యాద్ ఉంటది!” అనే ట్రెండ్ కూడా జోరుగా నడుస్తోంది.హీరోల కంటే ముందు ఎడిటర్ పేరు ప్రేక్షకులకు గుర్తొచ్చే స్థాయికి తీసుకెళ్లడం చిన్న విషయం కాదు. తన ప్రతిభతో, కష్టంతో, అంకితభావంతో నవీన్ నూలీ ఈ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు. 2025 టాలీవుడ్ ఫ్లాష్‌బ్యాక్‌లో నవీన్ నూలీ అనే పేరు ఖచ్చితంగా ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది.