ఆ హీరోయిన్ తో నాగార్జున ఆ సమయంలో అలా చేశాడా .. అందుకే పెళ్లికి దూరంగా ఉంటుందా..?
అలాగే ఈ అక్కినేని హీరో చాలా మంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపారని ఇప్పటికీ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి .. ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ టబు తో నాగార్జునకి ఎఫైర్ ఉందని .. ఇప్పటికీ పలు వార్తలు వస్తూనే ఉన్నాయి .. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి .. కానీ నాగార్జున మరో హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు . ఇక టబు ఐదు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది .. అయితే టబు ఇలా సింగల్ గా ఉండటానికి కారణం నాగార్జుననే కారణమని టాక్ కూడా ఉంది.
నాగార్జున - టబు కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.. 1996 లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా సూపర్ హిట్ అయింది.. టాలీవుడ్ సినీ యర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున టబు ని కొరికే ఓ సన్నివేశం ఉంటుంది .. ఆ క్రమంలోనే నాగార్జున కాస్త టెంప్ట్ అయిపోయి ఆమెని గట్టిగా కొరికేశాడట. దీంతో టబు కాస్త గట్టిగా అరిచిందట. ఈ సీన్ చాలా బాగా వచ్చినప్పటికీ టబుని కొరికితే ఆమెకు అక్కడ గాట్లు కూడా పడ్డాయట. ఇక ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.