"అక్కినేని ఫ్యామిలీలో మరో శుభకార్యం కూడా.. ఒక ఏడాదిలో మూడు గుడ్ న్యూస్ లు"..నాగార్జున కామెంట్స్ వైరల్..!
అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పెళ్లిని చేయబోతున్నారు . ఇక తర్వాత నాగచైతన్య తమ్ముడు అఖిల్ పెళ్లి కూడా జరగబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించేసాడు. ప్రముఖ వ్యాపారవేత్త కూతురు జైనబ్ తో తన కొడుకు నిశ్చితార్ధం జరిగిన ఫోటోలను సైతం షేర్ చేశారు. రీసెంట్ గా ముందుకు వచ్చిన నాగార్జున చైతు అదే విధంగా అఖిల్ పెళ్లి పై స్పందించారు . మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్న కు కూల్ గా ఆన్సర్ ఇచ్చారు.
"ఒకేసారి చైతు - అఖిల్ పెళ్లి జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది" అని ప్రశ్నించగా "అదంతా ఫేక్" అంటూ కొట్టి పడేశారు . చైతూ పెళ్లి అయ్యాక 2025లో అఖిల్ పెళ్లి జరిపించేలా ప్లాన్ చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అంతేకాదు "ఈ ఏడాది మాకు ఎంతో శుభం కలిగించింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శుభకార్యాలు జరిగేలా చేసింది .ఒకటి నాన్నగారి శతజయంతి వేడుకలు.. రెండు చైతన్య -శోభిత ల పెళ్లి.. మూడు అఖిల్ - జైనబ్ నిశ్చితార్ధం.. ఎప్పటికీ 2024 ని మర్చిపోలేమంటూ" నాగార్జున మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా సోషల్ మీడియాలో మళ్లీ ఇంకొక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ పెళ్లి కూడా జరగబోతుంది అంటూ ఓ వార్త ట్రెండ్ అవుతుంది. అయితే సుశాంత్ తన సొంత మరదలినే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త బాగా హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. దీని పై అక్కినేని కుటుంబం ఇప్పటి వరకు స్పందించలేదు..!