శివాజీ హీరోయిన్ల సామాన్లు కామెంట్ వివాదంలోకి రామ్ చరణ్ "పెద్ది"..ఈ కొత్త తల నొప్పి ఏంట్రా..?
ఈ నేపథ్యంలో అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా ఈ వివాదంలోకి రావడం మెగా అభిమానుల్లో కొంత నిరాశను కలిగిస్తోంది. శివాజీకి మద్దతుగా మాట్లాడుతున్న కొందరు నెటిజన్లు, ఆయన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వాదిస్తున్నారు. అదే సమయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు అనే ప్రశ్నలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు.శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నవారిని ఉద్దేశించి, ఆయనకు మద్దతు ఇస్తున్నవారు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటలో ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా అనిపించలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నవారు, మరోవైపు పాటల్లో వినిపించే అశ్లీల పదాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారన్నదే వారి ప్రధాన వాదన.
ఈ వివాదంలోకి ప్రముఖ నటీమణి అనసూయ, సింగర్ చిన్మయి పేర్లను కూడా లాగుతున్నారు. శివాజీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ గట్టిగా స్పందించిన వారు, ‘చికిరి చికిరి’ పాటలో వినిపించిన పదాల విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు, చర్చలు కొనసాగుతున్నాయి.
మొత్తానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ఒక పెద్ద చర్చకు దారి తీశాయి. ఇది వ్యక్తిగత అభిప్రాయాల పరిమితిని దాటి, సినీ పరిశ్రమలో పాటల పదాలు, మహిళల ప్రాతినిధ్యం, అభివ్యక్తి స్వేచ్ఛ వంటి అంశాలపై విస్తృత చర్చకు కారణమవుతోంది. ఇక ఈ మొత్తం వివాదంపై ‘పెద్ది’ సినిమా టీమ్ స్పందిస్తుందా? లేక మౌనం పాటిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారగా, మెగా అభిమానులు ఈ వివాదం మరింత పెద్దదవకుండా ముగిసిపోతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి… ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో, సంబంధితవారు ఎలా స్పందిస్తారో..??