అబ్బాయ్‌ను సైడ్ చేసి బాబాయ్‌పై గురి పెట్టిన కొరటాల . . . ?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో రూట్ మార్చినట్లు తెలుస్తోంది. గతేడాది ఎన్టీఆర్‌తో ‘దేవర’ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన, ఇప్పుడు అబ్బాయిని వదిలి బాబాయ్ నందమూరి బాలకృష్ణ చెంతకు చేరారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ పార్ట్-1 తర్వాత వెంటనే పార్ట్-2 ఉంటుందని అందరూ భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులతో ( వార్-2 , డ్రాగన్ ) బిజీగా ఉండటం , ‘ దేవర - 2 ’ పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉండటంతో కొరటాల తన ఫోకస్ మార్చారు.
బాలయ్యతో సినిమా :
కొరటాల శివ ఇటీవల బాలకృష్ణను కలిసి ఒక పవర్‌ఫుల్ సామాజిక అంశంతో కూడిన యాక్షన్ కథను వినిపించారట. బాలయ్యకు ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ ‘ సింహా ’ చిత్రానికి కొరటాల శివ డైలాగ్స్ అందించారు. ఇప్పుడు డైరెక్టర్‌గా బాలయ్యను ఏ రేంజ్‌లో చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే కొరటాల శివ - బాలకృష్ణ కాంబో పట్టాలెక్కే అవకాశం ఉంది.
వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న కొరటాల శివకు , మాస్ గాడ్ బాలయ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. అబ్బాయి తో మిస్ అయిన మేజిక్‌ను బాబాయ్‌తో రిపీట్ చేసి, కొరటాల తన ‘ బ్లాక్ బస్టర్ ’ ఫామ్‌ను తిరిగి పొందుతారో లేదో వేచి చూడాలి.