హేటర్స్ కి బ్యాడ్ న్యూస్..ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 2025 ఫైనల్ ట్విస్ట్ ఇచ్చిన సమంత..!
ఇదిలా ఉండగా, సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేస్తూ వాటికి “ఆ Yఏర్ ఒఫ్ ఘ్రతితుదె” అనే క్యాప్షన్ జోడించింది.ఆ ఫొటోలను గమనిస్తే, గత ఏడాది తన జీవితంలో ఆనందాన్ని, సంతృప్తిని కలిగించిన అన్ని ముఖ్యమైన క్షణాలను ఆమె అందులో పొందుపరిచింది. మెహందీ వేడుక, వివాహ ఫొటోలు, ‘ఆల్ కెమిస్ట్’ పర్ఫ్యూమ్ లాంచ్, ‘శుభం’ సినిమా విజయం, అలాగే రాజ్ నిడిమోరుతో కలిసి తీసుకున్న వ్యక్తిగత క్షణాల ఫొటోలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఫొటోలోనూ సమంత ముఖంలో కనిపించే ఆనందం, సంతోషం అభిమానులను ఆకట్టుకుంటోంది.
అయితే పెళ్లి జరిగి కొంత కాలం గడిచిన తర్వాత ఇప్పుడు మెహందీ ఫొటోలను షేర్ చేయడంతో నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. “సామ్ బేబీ ఇప్పుడా మెహందీ ఫొటోలు షేర్ చేసేది?” అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, మరికొందరు “ఈ ఫొటోలు చూస్తేనే సమంత ఎంత హ్యాపీగా ఉందో అర్థమవుతోంది” అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక సమంతను విమర్శించే వారికి ఇవి కొంచెం బ్యాడ్ గా కనిపిస్తాయ్.. ఈ ఫొటోలు మాత్రం ఆమె అభిమానులకు మంచి బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ‘ఎ ఇయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్’ పేరుతో సమంత షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి మరోసారి ఆమె పాజిటివ్ ఫేజ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.