ఇక పిఠాపురం ప‌వ‌న్‌కు కంచుకోట‌... ఓడించ‌డం ఎవ్వ‌డి త‌రం కాన‌ట్టే..?

RAMAKRISHNA S.S.
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . .

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా 20 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఆయన ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు మున్సిపాలిటీలతో పాటు ... 52 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తన నియోజ‌క వ‌ర్గ పరిధిలో ఉన్న సమస్యలు అలాగే ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలని అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు పర్యటించి పరిశీలించి నివేదికలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నివేదికలు అందిన త‌ర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నారు.

పిఠాపురాన్ని భవిష్యత్తులోనూ తనకు తిరుగులేకుండా కంచుకోటగా మార్చుకునే క్రమంలో పవను ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పిఠాపురాన్ని ఇంతకాలం తన అడ్డాగా టీడీపీ నేత .. మాజీ ఎమ్మెల్యే వర్మ భావిస్తూ వస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు ను పవన్ కోసం త్యాగం చేశారు. వర్మ ఒకంత బాధపడినా చివరికి చంద్రబాబు స్వయంగా పిలిపించుకొని వర్మను ఒప్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా వర్మకు హామీ ఇచ్చారు.

ఇలాంటి టైంలో వర్మను జనసేన దూరం పెడుతూ వస్తోంది. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్ కు వర్మకు అస్సలు పడ‌టం లేదు. ఇప్పుడు పిఠాపురంలో టీడీపీ - జనసేన మధ్య విభేదాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టి పిఠాపురం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునేలా ప్రణాళికలు రచిస్తుండటం చూస్తుంటే వర్మకు భవిష్యత్తులను పిఠాపురం పై పట్టు చిక్కుతుందా ? మరి వర్మ పరిస్థితి ఏంటి చంద్రబాబు ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తారు ? వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారా అన్న సందేహాలు, పిఠాపురం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: