ఏపీ: దువ్వాడ-మాధురి పైన కేస్ ఫైల్.. ఏం జరిగిందంటే..?

Divya
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దువ్వాడ శ్రీనివాస్, ఆయన స్నేహితురాలు మాధురి వీరి పేర్లు గత కొన్ని నెలలుగా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఏవేవో ఉన్నాయని విధంగా తెలియజేస్తూ ఇటీవల ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ పలు విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. గడిచిన రెండు రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో రూల్స్ చేశారంటూ ఆమె పైన కేసు వేయడం కూడా జరిగింది. అయితే ఇది టిడిపి ఫిర్యాదు మేరకే మాధురి పైన సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆమె రీల్స్ చేసినట్లుగా పలు రకాల ఆరోపణలు వినిపించాయి. ఆలయం దగ్గర రీల్స్ చేయడం పైన చాలామంది టీటీడీ సభ్యులు కూడా అభ్యంతరాన్ని తెలియజేశారు. వీటిపైన విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి రీల్స్ చేయడం చాలా అభ్యంతరకరమని ఈ ఫిర్యాదులు తెలియజేసినట్లు సమాచారం. తిరుమల మాడవీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం విరుద్ధమంటూ డిఎస్పి విజయ్ శేఖర్ వెల్లడించారు.

అలాగే మాధురి చేసినటువంటి రీల్స్ పైన కూడా టిడిపి ఫిర్యాదు చేసిందని తెలిపారు  వీటిపైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు పవిత్రమైనటువంటి దేవాలయాలలో దేవుడికి సంబంధించిన విషయాలను మాత్రమే ఎవరైనా మాట్లాడాలని వ్యక్తిగత విషయాలను మాట్లాడకూడదంటూ తెలిపారు. మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే వీరి మీద సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశామంటూ తెలిపారు. BNS -292,296,300 సెక్షన్ ప్రకారం వీరు మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఇద్దరు కలిసి మాడవీధులలో హల్చల్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఈ మధ్య కూడా వైరల్ గా మారడంతో తాము ఇంకా వివాహం చేసుకోలేదని కోర్టు కేసు కొలికి వచ్చిన తర్వాతే చేసుకుంటామంటూ వెల్లడించారు. తిరుపతిలో ఇలా చేయడం నిషేధం అంటూ వీరి మీద కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే తాము తీలేదని కేవలం కొంతమంది ఇలా తమ ఫోటోలను తీసి వైరల్ చేశారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: