ఏపీకి బుల్లెట్ ట్రైన్.. 2029 నాటికి బాబు ఏపీ రూపురేఖలను మార్చేయనున్నారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలని ప్రజల ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం తన విజన్ తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు కృషితో ఏపీకి బుల్లెట్ ట్రైన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ ఏపీకి బుల్లెట్ ట్రైన్ ను ప్రతిపాదించింది. ఏపీ ఎంపీలకు చంద్రబాబు ఈ విషయాన్ని తెలియజేశారు.
 
చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ను కలిసి వేర్వేరు అంశాల గురించి చర్చించారు. సీఎం ఢిల్లీలో అందుబాటులో ఉన్న కొందరు కూటమి ఎంపీలతో సమావేశం అయ్యారు. మోదీ సర్కార్ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు నడపాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం ఏడు మార్గాల్లో ఈ హై స్పీడ్‌ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
మొదటి దశ ప్రతిపాదనల్లో ఏపీ లేకపోయినా తాజాగా ఈ జాబితాలో ఏపీని చేర్చారు. చెన్నై నుంచి బెంగళూరు మీదుగా మైసూరు వరకూ ఒక ట్రైన్‌, ముంబాయి నుంచి హైదరాబాద్‌కు మరో ట్రైన్‌ కు సంబంధించి ప్రతిపాదనలు జరిగాయని తెలుస్తోంది. ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ వేసి ఈ బుల్లెట్ ట్రైన్ ను నడపనున్నారు. మరోవైపు భారీ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ను రూ.అరవై వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు.
 
రామాయపట్నం వైపు బీపీసీఎల్ మొగ్గు చూపుతుండటం గమనార్హం. మరోవైపు విశాఖపట్నం ప్రాంతంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు రానున్నట్టు చంద్రబాబు తెలిపారు. పునరుత్పాదక ఇంధనాల్లో ఇది కొత్త తరం టెక్నాలజీకి సంబంధించిందని తెలుస్తోంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఎగుమతి చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని సీఎం మంత్రులకు చెప్పారు. మరికొన్ని సంవత్సరాలలో ఏపీకి బుల్లెట్ ట్రైన్ రావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: