పవన్‌ కళ్యాణ్‌ రియల్‌ హీరో కాదు..డూప్‌ హీరోనే..రెచ్చిపోయిన యాంకర్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పుంగనూరు చిన్నారి హత్య కేసు ఘటన హాట్ టాపిక్ అయింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ తిరిగితే.. ఇప్పుడు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరు సంవత్సరాల బాలిక హత్య ఘటన పైన...రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ బాలిక కిడ్నాప్ పై హత్యకు గురైన కూడా... చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని వైసిపి ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి సంఘటనలపై ఎక్కడ స్పందించడం లేదని మండిపడుతున్నారు వైసిపి నేతలు.

అయితే తాజాగా ఇదే సంఘటనపై సోషల్ మీడియా వేదికగా వైసిపి పార్టీ అధికార ప్రతినిధి అలాగే యాంకర్ శ్యామల స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబును అలాగే.. పవన్ కళ్యాణ్ ను ఏకీపారేసారు యాంకర్ శ్యామల. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని అందరూ అనుకున్నారని..  ఆయన డూప్ అని తేలిపోయిందని చురకలాంటించారు. ఎన్నికల కంట ముందు మహిళల కోసం పోరాడుతానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించడం లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల హత్యలు అలాగే రేపులు జరుగుతున్నా కూడా... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణం అన్నారు. నిండు పున్నం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకునేలా చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహించారు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయనిఫైర్ అయ్యారు. రామరాజ్యాన్ని రమణ కాష్టంగా మార్చుతోందని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు శ్యామల.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా... లో ఆరు సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ పై హత్యకు గురైతే... ఇప్పటివరకు ఆయన స్పందించకపోవడం దారుణం అన్నారు. బాబు వస్తే అదొస్తుంది ఇది వస్తుందని అన్నారు... అసలుకే పంగనామాలు పెట్టారని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా... సెటైర్లు పేల్చుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: