ప్రకాశ్ రాజ్...డిపాజిటే రాలేదు..నీకెందుకు రాజకీయాలు..?
ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య... రచ్చ జరుగుతున్న నేపథ్యంలో... ప్రకాష్ రాజు గెలిచారు తమిళ నిర్మాత వినోద్ కుమార్. ప్రకాష్ రాజ్ దాదాపు మూడుసార్లు ఎన్నికల్లో నిలిస్తే.... డిపాజిట్ కూడా రాలేదని... సెటైర్లు పేల్చారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తో కూర్చున్నాడని... ప్రకాష్ రాజ్ ఫోటోను షేర్ చేశాడు.
ఎలాంటి కారణం చెప్పకుండానే... ప్రకాష్ రాజ్ చాలా సార్లు సినిమా సెట్ నుంచి.. పారిపోయాడని కూడా వినోద్ కుమార్ చెప్పడం జరిగింది. తన వల్ల.. నాకు కోటి రూపాయల వరకు నష్టం జరిగిందని కూడా వినోద్ కుమార్ ఆరోపణలు చేశారు. దీనిపై కాల్ చేస్తానని ప్రకాష్ రాజ్ ఇంతవరకు చేయలేదని కూడా పోస్ట్ పెట్టారు వినోద్ కుమార్. ఈ సంఘటన ఎనిమీ మూవీ షూటింగ్ అప్పుడు జరిగిందట. మొదట సినిమాకు ఒప్పుకొని... షూటింగుకు రాకుండా ప్రకాష్ రాజ్ తప్పించుకున్నారట.
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజు... గెలుకుతున్న నేపథ్యంలో.. తమిళ నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ వర్సెస్ ఉదయనిది స్టాలిన్ మధ్య గొడవలు జరుగుతున్న సందర్భంగా... ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారు. తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తో.. కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజు రాసుకొచ్చారు. అయితే దీనిపై వినోద్ కుమార్ కౌంటర్ ఇవ్వడం జరిగింది.