ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఫర్నిచర్ గొడవ కొనసాగుతోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాంపు కార్యాలయంలో... లక్షలు విలువ చేసే ఫర్నిచర్ ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని కొనుగోలు చేసి తన ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... ఇదే ఫర్నిచర్ పైన కూటమి ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసింది. ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ ను జగన్మోహన్ రెడ్డి దొంగిలించాడని కూడా ఆరోపణలు చేయడం జరిగింది.
అచ్చం టిడిపి దివంగత నేత కోడెల శివప్రసాద్.. విషయంలో ఇదే జరిగింది. 2014 సంవత్సరంలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు... ప్రభుత్వ ఫర్నిచర్ ను.. కోడెల శివప్రసాద్ వాడుకుని... నొక్కేశారని వైసీపీ అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే ఈ ఎపిసోడ్ తర్వాతే ఆయన మరణించడం జరిగింది. దీంతో ఆ నేపాన్ని మొత్తం వైసీపీకి నెట్టింది టిడిపి పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీ అవమానించడంతోనే...కోడెల శివప్రసాద్ మరణించారని.. ప్రచారం చేసింది.
అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా... కోడేల ఎపిసోడ్ తరహా లోనే వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఫర్నిచర్ దొంగిలించారని ఆరోపణలు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను వెంటనే ప్రభుత్వం తీసుకువెళ్లాలని.. ఇప్పటికే పలుసార్లు వైసిపి కార్యదర్శి లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై స్పందించలేదట.
దీంతో గురువారం రోజున కూడా మరో లేఖ సంధించింది. వెంటనే ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ ప్రభుత్వం తీసుకువెళ్లాలని... పేర్కొంది. లేకపోతే ఆ ఫర్నిచర్ ధర ఎంతనో... చెబితే... ఆ డబ్బులు చెల్లిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారట. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి ఉలుకు పలుకు కనిపించడం లేదు. అయితే ఈ వ్యవహారంలో నాన్చుడు ధోరణితో.. వెళ్లి మళ్లీ జగన్మోహన్ రెడ్డి పై కుట్రలు చేసే ప్రయత్నంలో కూటమి ఉన్నట్లు... వైసిపి ఆరోపణలు చేస్తోంది.