చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్ అదిరిపోయే స్కెచ్?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని... ప్రజల మధ్య నిలదీసేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఓడిపోయిన తర్వాత బెంగళూరులో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి... వారంలో మూడు రోజులు ఏపీకి వచ్చి నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ముందు ముందు ఎలా.. పార్టీని నడపాలనే దానిపైన కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు.
 

ఈ మధ్యకాలంలో వరుసగా జిల్లాల వారీగా వైసీపీ నేతలతో సమావేశం అవుతున్న జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు... వైసీపీకి కాస్త అనుకూలంగా రావడంతో.. జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో తమ పైన అన్యాయంగా అబాండాలు  మోపారని.. అలాంటి వారికి తిరుమల శ్రీవారి శాపం తగిలిందని కూడా జగన్ మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది.
 

ముఖ్యంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష పెన్షన్లను కట్ చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ,  విద్యార్థులకు ఇచ్చే విద్యా దీవెన లాంటి అనేక స్కీములను... చంద్రబాబు అమలు చేయడం లేదని కూడా... చెబుతున్నారు. వాలంటీర్లను పక్కకు పెట్టారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందుత్వాన్ని రెచ్చగొట్టడం తప్ప ఏపీ ప్రజలకు కూటమి చేసింది ఏమీ లేదని... జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రతి జిల్లాలో.. ఒకటి నుంచి మూడు బహిరంగ సభలు నిర్వహించుకుంటూ... వెళ్లాలని అనుకుంటున్నారు.  అతి త్వరలోనే పాదయాత్ర కూడా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి.  ఇప్పటినుంచే యాక్టివ్ అయితే పార్టీని వీడియో వారి సంఖ్య తగ్గిపోతుందని జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని... రెడీ అవుతున్నారట. ఎంత త్వరగా ప్రభుత్వంపై నెగెటివిటీ తీసుకువస్తే అంత మంచిదని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: